Kavitha – Determination & Consistency means Success

This article can be read in both English and తెలుగు

Determination & Consistency means Success

When an idea is first formed, it’s often incomplete, and the journey from concept to reality is rarely smooth. We frequently lose precious time navigating the gap between expectations and reality. However, what truly matters is consistency. This is the story of Ms. Kavitha. A journey from an innocent village girl to one of the most influential figures in Andhra Pradesh, Telangana, and Bangalore.
Image used in main Draft

Kavitha initially aspired to create a YouTube channel for children, but that plan didn’t materialise. It was in the most unexpected circumstances that we generally find a direction. Trust me! We are from Andhra Pradesh, and our passion cooking is an inexpressible in English vocabulary, Kavitha’s first video was simple: a dish narrated in Telugu. What began as a modest effort would eventually lead her to become a notable content creator.

One of the first cooking videos.
Every great idea faces challenges, and Kavitha’s journey was no exception. She initially struggled with limited exposure and technical knowledge. Although YouTube offers countless tutorials, practical implementation comes with its own set of challenges. High-quality video and audio, editing—it all comes at a cost, both in time and money. Her first hurdle was removing the watermark from the editing software she used. In addition, she faced negative comments, particularly from mischievous male users online, along with other recurring challenges. Yet, in less than three years, Kavitha distinguished herself as a successful Telugu content creator in a predominantly Kannada-speaking region—It is just remarkable.
The path to earning from YouTube isn’t as easy as everyone suggests. Building an organic following, maintaining watch hours, and adhering to platform guidelines is a full-time job. For a homemaker, this can be an enormous task, balancing family, chores, and the demanding process of video creation, editing, and dubbing. After months of preparation, Kavitha began uploading videos regularly from May 2021.
Kavitha Final
YT Creator's Collective, Bangalore

Through her determined efforts, Ms. Kavitha has emerged as a successful influencer/content creator across Andhra Pradesh, Telangana, and Bangalore. By August 2024, she had amassed over 100,000 subscribers on YouTube and more than 100,000 followers across Instagram and Facebook combined. With over 500 unique recipes shared with her Telugu audience, she has secured a well-deserved place among the top content creators. By mid-2024, Kavitha’s growing popularity led to endorsements from various industries in Bangalore, Vijayawada, and Hyderabad. Her journey from a simple village girl to one of the most influential figures in the region is truly inspiring, and she continues to be a source of inspiration for many in the Telugu community.

Podcast

Podcast with Ms Kavitha is now streaming on both YouTube & Spotify.

Share your inspiring story. Join me for a chance to be featured on my podcast and let your voice be heard.
స్థిరత్వానికి దృఢ సంకల్పం తోడైతే విజయం మనదే
ఒక ఆలోచన మొదటగా కలిగినప్పుడు, అది పూర్తి స్థాయిలో ఉండదు. ఆ ఆలోచనను వాస్తవంగా మార్చే ప్రయాణం అనుకున్నంత సులువుగా ఉండదు. ఆశలకూ అలాగే వాస్తవాలకు మధ్య ఉన్న ఖాళిని ఎదుర్కొనే ప్రయత్నంలో, మనం అనేకసార్లు విలువైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది. అయినప్పటికీ, ఎప్పటికీ ముఖ్యమైనది స్థిరత్వం. ఇది శ్రీమతి కవిత గారి కథ, ఒక సాధారణ గ్రామీణ అమ్మాయి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరియు బెంగళూరులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరైన ఆమె ప్రయాణం.
Image used in main Draft
పిల్లల కోసం ఒక YouTube ఛానల్ సృష్టించాలని మొదటగా ఉన్నప్పటికీ, ఆ ప్రణాళిక కార్యరూపంలోకి రాలేదు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది కార్యరూపంలోకి తీసుకురావడానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఆ పని ఒకసారి యాదృచ్ఛికంగా ప్రారంభం కావచ్చు కూడా. Trust me! ఆంధ్రులందరూ భోజన ప్రియులు, రుచి ఆస్వాదించే విషయంలో మాటల్లో వర్ణన సాధ్యం కాని విషయం. అలా కవిత గారి మొదటి వీడియో ప్రచురించటం జరిగింది: ఒక తమిళ స్నేహితురాలి సహాయంతో, తెలుగులో voice-over తో ప్రారంభించడం జరిగింది. మొదట ఇది ఏదో తనకు సులభం అనిపించే పనిగా ప్రారంభమైన ఈ ప్రయాణం, ఆమెను ఒక ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా నిలిపింది.
One of the first cooking videos.
ప్రతి గొప్ప ఆలోచనకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. కవిత గారి ప్రయాణం కూడా మినహాయింపు కాదు. ప్రారంభంలో, పరిమితమైన అవగాహన అలాగే సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. YouTube లో అనేక ట్యుటోరియల్స్ ఉన్నప్పటికీ, practical implementation చాలా సవాళ్లతో కూడి ఉంటుంది. నాణ్యత ఉన్న వీడియో మరియు ఆడియో, ఎడిటింగ్—తయారుచేయాలంటే సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మొదటి అడ్డంకి ఆమె ఉపయోగించిన ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ నుండి watermark తొలగించడం. దానికి తోడు, అనేక చెడు వ్యాఖ్యలు, ముఖ్యంగా అమ్మాయి ఇక్కడ ఉందంటే దుష్టంగా ప్రవర్తించే ఆన్‌లైన్ పురుషులు, ఇంకా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ మూడు సంవత్సరాల లోపల, కవిత గారు బెంగళూరు ప్రాంతంలో ఒక విజయవంతమైన తెలుగు కంటెంట్ క్రియేటర్‌గా నిలబడటం—ఇది నిజంగా అసాధారణమైన విషయం.

YouTube నుండి ఆదాయం పొందడం ప్రతి ఒక్కరు చెప్పినంత సులభం కాదు. Organic following సంపాదించడం, watch hours నిర్వహించడం, YouTube మార్గదర్శకాలను అనుసరించడం ఒక పూర్తి స్థాయి ఉద్యోగం. అదే ఒక గృహిణికి—కుటుంబం, పనులు, మరియు వీడియో సృష్టి, ఎడిటింగ్, డబ్బింగ్ వంటి ప్రక్రియను సరిచేయడం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ, ముందు ఒక నెల రోజులు ప్రిపరేషన్ చేసుకున్నాక, కవిత గారు 2021 మే నుండి వీడియోలను upload చేయడం ప్రారంభించారు.

Kavitha Final
YT Creator's Collective, Bangalore

స్థిరత్వానికి దృఢ సంకల్పం తోడైతే విజయమే మనదే. శ్రీమతి కవిత గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు బెంగళూరులో విజయవంతమైన content creator గా అతి తక్కువ కాలంలోనే ఎదిగారు. 2024 August నాటికి, ఆమె YouTube లో 100,000 కి పైగా Subscribers మరియు Instagram మరియు Facebook లో 100,000 కి పైగా ఫాలోవర్లను సంపాదించారు. ఆమె తెలుగువారికి 500 కి పైగా ప్రత్యేక వంటకాల్ని పరిచయం చేస్తూ, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ లలో ఒకరిగా స్థానం సంపాదించారు.

 2024 August నాటికి, కవిత గారి ప్రాచుర్యం పెరిగి, బెంగళూరు, విజయవాడ మరియు హైదరాబాద్ లోని వివిధ పరిశ్రమల నుండి అనేక business endorsements తో తన ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. ఆమె ఒక సాధారణ గ్రామీణ అమ్మాయి నుండి ఒక అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగిన ఈ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకమైన, స్పూర్తిదాయకమైన విషయం

Podcast

Podcast with Ms Kavitha is now streaming on both YouTube & Spotify.

Share your inspiring story. Join me for a chance to be featured on my podcast and let your voice be heard.
Share the Article and Show some support :)
Venky
Venky

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *